News April 4, 2025
విజయనగరంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్

విజయనగరంలోని వీటి అగ్రహారంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌ను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్ శుక్రవారం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా రీఛార్జ్ చేసేందుకు ఈ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వాహనదారులంతా రీఛార్జి స్టేషన్‌ను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆయనతోపాటు ఈపీడీసీఎల్ జిల్లా అధికారులు ఉన్నారు.
Similar News
News November 6, 2025
మెంటాడ మార్పుపై ఎటువంటి ప్రతిపాదన చేయలేదు: మంత్రి

మెంటాడ మండలాన్ని మన్యం జిల్లాలో చేర్చాలనే అంశంపై తాను ఎటువంటి ప్రతిపాదన చేయలేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. జడ్పీ సమావేశంలో జడ్పీటీసీ సన్యాసినాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి ఆందోళనలో చేపడుతున్నారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఇతర జిల్లాల నుంచి మాత్రమే ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొన్నారు. అనవసర ఆందోళనలు వద్దని సూచించారు.
News November 6, 2025
VZM: ‘రియల్ టైం గవర్నెన్స్‌తో ప్రజలకు చేరువుగా సేవలు’

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు మరింత చేరువవుతున్నాయని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. ఉన్నత స్థాయి అధికారులతో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఎస్పీ పాల్గొన్నారు. నేర నియంత్రణలో టెక్నాలజీ వినియోగంపై సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు అందజేశారన్నారు. ఈ మేరకు అమలు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
News November 6, 2025
రాజాం: పాము కాటుకు గురైన రైతులు

రాజాం మండలంలో పొలం పనులు కొనసాగుతుండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా విషకీటకాల బారినపడుతున్నారు. పాము కాటు బాధితుల్లో 90% మంది వీరే ఉంటున్నారు. మండలంలో అమరం గ్రామానికి చెందిన శంకర్రావు, సంకిలి గ్రామానికి చెందిన శివ, కింజంగి గ్రామానికి చెందిన శ్రీరాము, పెంట గ్రామానికి చెందిన ఆదినారాయణ వరికోతలు చేస్తుండగా బుధవారం పాము కాటుకు గురయ్యారు. వీరు రాజాం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


