News March 21, 2024
విజయనగరంలో గంజాయితో వ్యక్తి అరెస్టు

విజయనగరం రైల్వే స్టేషన్ పక్కన గల ఓల్డ్ రైల్వే క్వార్టర్స్ వద్ద అనుమానాస్పదంగా గంజాయితో తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నామని వన్ టౌన్ సీఐ బి.వెంకటరావు తెలిపారు. అతని వద్ద నుంచి 9 కిలోల గంజాయి, రూ.1070 నగదు, ఒక మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నామన్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించామని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
VZM: హోంమంత్రి అధ్యక్షతన నేడు DRC సమావేశం

విజయనగరం కలెక్టరేట్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మినిస్టర్ వంగలపూడి అనిత అధ్యక్షత వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల ప్రగతి, ప్రజా సేవల అమలు స్థితి, సంక్షేమ పథకాల పురోగతి వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నారు.
News December 4, 2025
స్క్రబ్ టైఫస్పై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ప్రభుత్వ పరంగా జిల్లాలో ఎటువంటి స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కానప్పటికి ఇతర జిల్లాలలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం సూచించారు. వైద్య అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజలందరూ ఆందోళన చెందవద్దని, అనుమానం ఉంటే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటే సులభంగా బయటపడవచ్చన్నారు.