News November 15, 2024
విజయనగరంలో టుడే టాప్ న్యూస్

>స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రద్దు > విజయనగరంలో గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం > బాల్యవివాహాలు చేస్తే సమాచారం ఇవ్వాలన్న ఎస్పీ వకుల్ జిందాల్ > నటుడు పోసానిపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు > బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలు గ్రీన్ ఛానల్ ద్వారా తరలింపు > ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాలల దినోత్సవం>కొండగుంపాంలో ఇంటి పైనుంచి జారిపడి మహిళ మృతి > పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం
Similar News
News October 30, 2025
VZM: జిల్లా కలెక్టర్, యంత్రాంగాన్ని అభినందించిన సీఎం చంద్రబాబు

మొంథా తుఫాన్ సమయంలో సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరించి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, జిల్లా యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన వీసీలో అభినందించారు. తుఫాన్ సమయంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చూపిన అంకితభావాన్ని సీఎం ప్రశంసించారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం అభినందనలకు ధన్యవాదాలు తెలిపారు.
News October 29, 2025
VZM: ‘రేపటి నుంచి యథావిధిగా పాఠశాలలు’

మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా మూసివేసిన పాఠశాలలను రేపటి నుంచి యథావిధిగా ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) మాణిక్యాల నాయుడు ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలను పునఃప్రారంభించాలని మండల అధికారులు, హెచ్ఎంలకు సూచించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News October 29, 2025
విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లాలో తుఫాన్ కారణంగా జరిగిన నష్టాల అంచనాలను తక్షణం పంపించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు బుధవారం ఆదేశించారు. శాఖలవారీగా నిజమైన వివరాలు, ఫొటోలు సహా అంచనాలు పంపాలని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల బియ్యం సహాయాన్ని వెంటనే అందించాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో 24 గంటలు కృషి చేసిన అధికారులు, సచివాలయ సిబ్బందిని అభినందించారు.


