News August 17, 2024
విజయనగరంలో టైక్వాండో పోటీలు ప్రారంభం

న్యూ ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో టైక్వాండో అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి పోటీలను మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టైక్వాండో క్రీడ రోజురోజుకు ప్రాచుర్యం పొందుతోందన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొన్నారు.
Similar News
News July 8, 2025
జిల్లా వ్యాప్తంగా 500 ఎకరాల్లో ఉద్యాన మొక్కలు: కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద విజయనగరం జిల్లాలో 500 ఎకరాల్లో ఉద్యాన మొక్కలను నాటనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్ తన ఛాంబర్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. 8 నియోజకవర్గాల్లో ఉన్న 27 మండలాల్లో సుమారుగా 477 మంది రైతులకు మామిడి, జీడిమామిడి, కొబ్బరి, సపోటా, జామ మొదలగు 23 రకాల పండ్ల తోటలు మొక్కలు వేయుటకు సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
News July 7, 2025
బాధితుల సమస్యలు చట్ట పరిధిలో పరిష్కరించాలి: VZM SP

బాధితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని SP వకుల్ జిందాల్ అన్నారు. SP కార్యాలయంలో ఆయన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి 40 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలకు చెందినవి 13, కుటుంబ కలహాలు 4, మోసాలకు పాల్పడినవి 5, ఇతర అంశాలకు సంబంధించి 18 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి 7 రోజుల్లో పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
News July 7, 2025
VZM: కలెక్టరేట్‌కు 194 వినతులు

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRSకు ప్రజల నుంచి 194 వినతులు అందాయి. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 97 వినతులు అందగా పంచాయతీ శాఖకు 7, పింఛన్లు మంజూరు చేయాలని, తదితర అంశాలపై డీఆర్డిఏకు 31 వినతులు వచ్చాయి. మున్సిపాలిటీకి 5 , విద్యాశాఖకు 13, మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. వినతులు పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు.