News August 6, 2024

విజయనగరంలో ట్రైన్ కింద పడి ఆత్మహత్య

image

జిల్లా కేంద్రంలో విజయనగరం నుంచి పలాస వెళ్లే మార్గంలో ట్రైన్ కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వైయస్సార్ కాలనీకి చెందిన జి.వీర్రాజు బట్టల షాపులో పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. బట్టల షాపులో ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

Similar News

News September 11, 2024

కౌలు రైతుల రుణాల‌ను ముమ్మ‌రం చేయాలి: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో కౌలు రైతుల‌కు రుణాలు అందించే కార్య‌క్ర‌మాన్ని బ్యాంకులు మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ బ్యాంక‌ర్ల‌ను కోరారు. కౌలు రైతుల‌కు రుణాలు అందించే కార్య‌క్ర‌మంపై డీసీసీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. 2,333 మందికి కౌలు రుణాల కోసం బ్యాంకుల‌కు ద‌ర‌ఖాస్తులు పంపించామ‌ని వ్య‌వ‌సాయ శాఖ జిల్లా అధికారి రామారావు వివ‌రించారు.

News September 10, 2024

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

విజయనగరం పట్టణం అలకానంద కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. అక్కడ కొన్నాళ్లుగా ఒక మహిళ వ్యభిచార గృహం నిర్వహిస్తుందనే సమాచారంతో మంగళవారం సాయంత్రం దాడులు చేసి, ఇద్దరు విటులు, ఒక బాధితురాలితో పాటు వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

News September 10, 2024

ఐటీఐ అభ్యర్థులకు దుబాయ్‌లో ఉద్యోగావకాశాలు

image

విశాఖ కంచరపాలెం ప్రభుత్వ ITIలో ఈ నెల 12న ఉదయం 9 గంటల నుంచి అశోక్ లేలాండ్ కంపెనీ వారిచే జాబ్ ఫేర్ నిర్వహిస్తున్నట్లు విజయనగరం ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ టి.వి.గిరి మంగళవారం తెలిపారు. ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో పెయింటర్ ట్రేడ్లలో ITI పాసైన వారు అర్హులు. దుబాయ్‌లో ఉద్యోగావకాశం ఉంటుందన్నారు. వివరాలకు 9440197068, 9849118075 నంబర్‌లను సంప్రదించాలన్నారు.