News November 23, 2024

విజయనగరంలో నేటి నుంచి T20 .. షెడ్యూల్ ఇదే

image

స్థానిక PVG రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు ACA అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం నుంచి ఉదయం 11 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి రోజు అస్సాం–రైల్వేస్‌, 25న ఒడిస్సా–రైల్వేస్, 27న విదర్భ–పుదిచ్చేరి, 29న చండీగఢ్‌–ఛత్తీస్‌గఢ్‌, డిసెంబర్1న అస్సాం–పుదిచ్చేరి, 3న ఛత్తీస్‌గఢ్‌–విదర్భ, 5న చండీగఢ్‌–ఒడిశా జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.

Similar News

News November 24, 2025

రాజాం: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

image

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన రాజాం సారధి రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రాజాంలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న ఉర్లాపు సావిత్రి (30) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. సావిత్రి ఉరి వేసుకుని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి భర్త, కొడుకు, కుమర్తె ఉన్నారు. పోలీసులు సంఘటన స్థ‌లాన్ని ప‌రిశీలించారు.

News November 24, 2025

డిసెంబర్ 5న APNGGO కొత్తవలస యూనిట్ ఎన్నికలు

image

కొత్తవలసలోని APNGGO యూనిట్ ఎన్నిక డిసెంబర్ 5 న నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు K.ఆదిలక్ష్మి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సహాయ ఎన్నికల అధికారిగా యెర్రా రమణ, ఎన్నికల పరిశీలకులుగా ఆనంద్ కుమార్ వ్యవహరిస్తారన్నారు. ఈనెల 28న నామినేషన్ వేయాలని, కొత్తవలస, వేపాడ ఎల్కోటలో ఉన్న ఉద్యోగస్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.