News May 25, 2024

విజయనగరంలో నేడు డిప్యూటీ డీఈవో పరీక్ష

image

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఈవో పరీక్ష నేడు విజయనగరం జిల్లాలో 6 కేంద్రాల్లో జరుగుతోందని, మొత్తం 1,470 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని డీఆర్‌ఓ అనిత పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌‌‌‌తో పాటు ఒరిజినల్ ఫోటో, గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని సూచించారు.

Similar News

News February 13, 2025

తెర్లాం: వివాహేతర సంబంధమే హత్యకు కారణం?

image

తెర్లాం మండలం నెమలాంలో <<15434993>>సాఫ్ట్‌వేర్ ఉద్యోగి<<>> కె.ప్రసాద్‌ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెమలాంకు చెందిన ఓ వివాహితతో ప్రసాద్ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమె భర్త, మరిది కలిసి హత్య చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు నిందితులు విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

News February 13, 2025

రాజాం : తండ్రిని చూసేందుకు వెళ్లి దారిలో మృతి

image

రాజాం కాంప్లెక్స్ ఆవరణలో కాలువలో బుధవారం మెరకముడిదాంకి చెందిన మజ్జి రామకృష్ణ మృతి చెందిన విషయం <<15436428>>తెలిసిందే<<>>. శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు రామకృష్ణ రాజాం వచ్చాడు. కాంప్లెక్స్‌లో బైక్ ఉంచి బస్సులో వెళ్లాడు. రాత్రి తిరిగి కాంప్లెక్స్‌కి చేరుకున్నాడు. ఈక్రమంలో గుండెపోటు వచ్చి కాలువలో పడిపోగా ఎవరు చూడకపోవడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

News February 13, 2025

వంగర: ఉరి వేసుకొని వ్యక్తి మృతి

image

మెరకముడిదాంకు చెందిన శ్రీరాములు(52) చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. దీంతో వంగర మండలం చౌదరివలసలోని తన భార్య చెల్లెలు రమణమ్మ ఇంటికి వచ్చి ఆమెను డబ్బులు అడిగాడు. తను లేవని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం చౌదరివలస సమీప తోటలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!