News December 30, 2024

విజయనగరంలో ప్రారంభమైన కానిస్టేబుల్ పీఈటీ టెస్టులు

image

పోలీస్ నియామకాలకు సంబంధించి అభ్యర్థులు పీఎంటీ, పీఈటీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు విజయనగరం పోలీస్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఎంపికలను జిల్లా ఎస్పీ రకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రన్నింగ్, లాంగ్ జంప్, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపికైన వారికి త్వరలో రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు ఎవరినీ నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా కోరారు.

Similar News

News January 19, 2025

విజయనగరం గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ తొలగింపు

image

విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ రెడ్డి పద్మావతిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఛైర్మన్లుగా నియమితులై ప్రస్తుతం కొనసాగుతున్న వారిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెడ్డి పద్మావతిని ఛైర్ పర్సన్ తక్షణమే తొలగిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు వెలువడ్డాయి.

News January 19, 2025

VZM: గూగుల్ సెర్చ్ చేస్తున్నారా.. మీరే టార్గెట్

image

గూగుల్ సెర్చ్ చేస్తున్నవారినే టార్గెట్‌గా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని విజయనగరం SP వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఎక్కువ మంది తమకు అవసరమైన వాటిని గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా వెతుకుతున్నారని ఆయన అన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌లను క్రియేట్ చేసి సెర్చ్ చేసే సమయంలో ఆ సైట్‌‌ ముందు వరుసలో వచ్చేలా చేసి డబ్బులు దోచుకుంటున్నారని, పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాన్నారు.

News January 19, 2025

VZM: భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ చిన్న శ్రీను

image

విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ మంత్రి మంత్రి ముత్తంశెట్టి రాజీనామాతో ఆ ప్లేస్‌ను భర్తీ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మజ్జి శ్రీనివాసరావు విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.