News October 2, 2024
విజయనగరంలో బస చేసిన మహాత్ముడు.. ఎప్పుడంటే

మహాత్మా గాంధీకి విజయనగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన మూడుసార్లు విజయనగరంలో పర్యటించారు. 1921 మార్చి 30న మొదటి సారి ఇక్కడకు రాగా, 1929 ఏప్రిల్ 30న రెండోసారి వచ్చారు. ఇక మూడోసారి 1933 డిసెంబరు 28, 29 తేదీల్లో రెండురోజుల పాటు విజయనగరంలో పర్యటించారు. అప్పట్లో 5వ నంబరు బంగ్లాగా పిలిచే ప్రస్తుత అశోక్ బంగ్లాలో ఆయన బస చేశారు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు బంగ్లాలో కనిపిస్తాయి.
Similar News
News November 24, 2025
ఆలయ నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకోండి: AC

TTD శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గ్రామాల్లో భజన మందిరాల నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ శాఖ విజయనగరం జిల్లా AC శిరీష ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ స్థలం ఆధారంగా మందిరాలను టైప్ A, B, Cలుగా విభజించి రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. స్థల వివరాలు, యజమాని NOCను జతచేసి, దరఖాస్తులను తోటపాలెంలో ఉన్న దేవాదాయ శాఖ కార్యాలయానికి అందజేయాలన్నారు.
News November 24, 2025
అత్యాచారం కేసులో వ్యక్తికి 12 ఏళ్ల జైలు: SP

2019లో గరివిడిలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన బొండపల్లికి చెందిన సవిరిగాన సూర్యనారాయణకు విజయనగరం మహిళా కోర్టు 12 ఏళ్ల కఠిన కారాగార, శిక్ష రూ.2వేల జరిమానా విధించిందని ఎస్పీ దామోదర్ ఇవాళ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేశారన్నారు. PP సత్యం వాదనలతో నిందితుడిపై నేరం రుజువైందన్నారు. దర్యాప్తు చేసిన అధికారులను ఎస్పీ అభినందించారు.
News November 24, 2025
రాజాం: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన రాజాం సారధి రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రాజాంలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న ఉర్లాపు సావిత్రి (30) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సావిత్రి ఉరి వేసుకుని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి భర్త, కొడుకు, కుమర్తె ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.


