News February 14, 2025
విజయనగరంలో మంత్రి గన్ మెన్ బ్యాగ్ మిస్సింగ్

విజయనగరంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద గన్ మెన్‌గా పనిచేస్తున్న ఏఆర్ హెచ్‌సీ వెంకటరమణ బ్యాగ్ మిస్సింగ్ కలకలం రేపింది. బుధవారం రాత్రి కణపాక వెళ్లే రహదారి వద్ద బ్యాగ్‌ను ఆటోలో పెట్టి జిరాక్స్ తీసేందుకు వెళ్లగా తన బ్యాగ్ మిస్ అయినట్లు వన్ టౌన్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో బుల్లెట్ మ్యాగ్జిన్, 30 బుల్లెట్లు మిస్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. CI శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 21, 2025
నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్, భైంసా ఎస్డీపీవోగా రాజేశ్ మీనా నియమితులయ్యారు. రాజేశ్ మీనా గతంలో నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.
News November 21, 2025
వనపర్తి నూతన ఎస్పీగా డి.సునీత

రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో నూతన ఎస్పీగా సునీతను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే సునీత బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, పోలీసు వ్యవస్థ బలోపేతానికి ఆమె కృషి చేస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
News November 21, 2025
IPSల బదిలీ.. సిటీకి కొత్త బాస్‌లు

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. CID డీఐజీగా పరిమళ నూతన్, మహేశ్వరం DCPగా నారాయణరెడ్డి, నార్కోటిక్ SPగా పద్మజా, మల్కాజిగిరి DCPగా శ్రీధర్, సౌత్ జోన్ DCPగా కిరణ్ ఖారే, టాస్క్‌ఫోర్స్ DCPగా వైభవ్ గైక్వాడ్, ఎస్ఎంఐటీ డీసీపీగా రూపేశ్, గవర్నర్ ఏడీసీగా పి.సుభాష్, టీజీ ట్రాన్స్‌కో ఎస్పీగా శ్రీనివాస్, రాచకొండ క్రైమ్స్ డీసీపీగా గుణశేఖర్‌ను నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.


