News March 9, 2025

విజయనగరంలో ముగ్గురు కార్యదర్శులు సస్పెన్షన్ 

image

విజయనగరం నగర పాలక సంస్థలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను డబ్బులు సకాలంలో నగర పాలక సంస్థకు జమ చేయని ముగ్గురు కార్యదర్శులను సస్పెండ్ చేసినట్లు కమిషనర్ పి.నల్లనయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పన్ను వసూలు చేసి సకాలంలో జమ చేయడం లేదని గుర్తించి పన్ను డబ్బులు జమ చేపించి సస్పెండ్ చేశామన్నారు. పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడిన, నిర్లక్ష్యంగా ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News January 22, 2026

భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ జగన్‌దే: జడ్పీ ఛైర్మన్ మజ్జి

image

విజయనగరంలో బుధవారం జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం విమానాశ్రయం పూర్తి క్రెడిట్ జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. జగన్ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయని, మెజారిటీ భూ నిర్వాసితులు వైసీపి సానుభూతిపరులేనని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

News January 21, 2026

చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి జాతర తేదీలు ఖరారు..

image

చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర తేదీలు ఖరారయ్యాయి. జాతర వివరాలు..
➱ఫిబ్రవరి 22న (ఆదివారం) జాతర ప్రారంభం
➱23న (సోమవారం) పసుపు, కుంకుమ ముర్రాటలతో మొక్కుబడులు చెల్లింపులు
➱24న మంగళవారం రాత్రి గుడిలోకి ఘటాలు రావడంతో జాతర ముగుస్తుంది.
వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

News January 21, 2026

ఆపదలో ఉన్నాం.. డబ్బులు పంపించండి అంటూ కాల్స్: VZM ఎస్పీ

image

ఆపదలో ఉన్నామని చెప్పి ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసే కొత్త తరహా మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ప్రయాణంలో బ్యాగులు పోయాయని, మహిళలు, పిల్లల పేరుతో సహాయం కోరుతూ ఫోన్‌పే, గూగుల్‌పే స్కానర్లు పంపి మోసం చేస్తున్నారని ఆయన బుధవారం తెలిపారు. ఇలాంటి కాల్స్ వస్తే డబ్బులు పంపేముందు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని, అనుమానం ఉంటే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని జిల్లా ప్రజలకు సూచించారు.