News July 21, 2024
విజయనగరంలో యాక్సిడెంట్.. మృతులు గుర్తింపు

విజయనగరం జిల్లా జొన్నాడ సమీపంలో ఆదివారం జరిగిన ఘోర <<13674170>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతులను డెంకాడ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో తురక ప్రవీణ్ చంద్ (గుంటూరు), బాడిత మాను సన్యాసి(గుంపాం) అక్కడికక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది వరకూ గాయపడ్డారు. క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డెంకాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 23, 2025
జిల్లాస్థాయి చెకుముఖి పోటీల్లో గర్భాం ఏపీ మోడల్ విద్యార్థులు

విజయనగరం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి చెకుముఖి పోటీలు జరిగాయి. గర్భాం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. వచ్చె నెల 12,13,14 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో సైన్స్ ఎక్స్పో లో పాల్గొంటారని ప్రిన్సిపల్ అరుణ తెలిపారు. విద్యార్థులకు జనవిజ్ఞాన వేదిక మెరకముడిదాం మండల శాఖ ఇన్ఛార్జి ఎం.రఘునాథరాజు, నవీన్ అభినందించారు.
News November 23, 2025
VZM: ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూలం : బొప్పరాజు

ఉద్యోగ సంఘాలు ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని APJAC రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ హోమ్లో జిల్లా APJAC పరిధిలోని సభ్య సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పిన ఆయన.. పెండింగ్లో ఉన్న బకాయిల సాధనకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. APJAC సాధించిన విజయాలను కూడా సమావేశంలో వివరించారు.