News November 26, 2024
విజయనగరంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. భోగాపురం మండలం గూడెపువలసకి చెందిన రమేశ్ (25) విజయనగరం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ముందున్న బొలేరోని ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేశ్‌ని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై డెంకాడ ఎస్.ఐ ఏ. సన్యాసినాయుడు కేసు నమోదు చేశారు.
Similar News
News December 14, 2024
‘పోలీస్ బోర్డు’తో దర్జాగా గంజాయి రవాణా
గంజాయి అక్రమ రవాణాకు నిందితులు తమ వాహనాలకు ఏకంగా ‘పోలీస్ బోర్డు’ను తగిలించుకుని తరలించడం విస్మయం కలిగిస్తోంది. గురువారం రామభద్రపురం మండలం కొట్టక్కి వద్ద 810 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ నిందితులు తెలివిగా పోలీసులు, చెక్ పోస్టుల నుంచి తప్పించుకోవడానికి తమ వాహనాలకు ఏకంగా పోలీస్ బోర్డు, ఫేక్ నెంబర్ ప్లేట్‌లు వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
News December 13, 2024
భోగాపురం: చిట్టీల కేసులో భార్య, భర్త అరెస్ట్
చీటీలు, స్కీములు నిర్వహించి సుమారు రూ.2 కోట్లు వరకు మోసం చేసిన భీమిలి మండలం వలందపేటకు చెందిన భార్యాభర్తలు సరగడపార్వతీ, లక్ష్మణరెడ్డిలను అరెస్టు చేసినట్లు సీఐ ఎన్వీ ప్రభాకర్ తెలిపారు. భోగాపురం మండలం చెరుకుపల్లిలో చీటీలు, రకరకాల స్కీములు నిర్వహించి గ్రామస్థుల నుంచి సుమారు రూ.2 కోట్లు చీటింగ్ చేసినట్లు ఆ గ్రామానికి చెందిన మజ్జి త్రినాథమ్మ ఫిర్యాదుతో దర్యాప్తు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.
News December 13, 2024
మక్కువ: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
మక్కువ మండలంలోని శంబర రహదారి సమీపంలో ఇటుక బట్టి వద్ద పని చేస్తున్న అంజిబాబు విద్యుత్ షాక్‌కు గురై గురువారం మృతి చెందాడు. యానాదుల వీధికి చెందిన అంజిబాబు గత కొన్ని ఏళ్లుగా ఇటుక బట్టి వద్ద పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఐరన్ పైపులను తాకడంతో వెంటనే షాక్ గురయ్యాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.