News October 15, 2024
విజయనగరంలో విద్యుత్ శాఖ కంట్రోల్ రూం

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ అన్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూడాలని, అవసరమైన యంత్రాంగం, పరికరాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఎస్ఈ, ఈఈలను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ ప్రమాదాలు గుర్తిస్తే టోల్ ఫ్రీ నెం. 1912 లేదా కంట్రోల్ రూమ్ నెం. 94906 10102 తెలియజేయాలన్నారు.
Similar News
News November 13, 2025
VZM: జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ఎక్కడంటే..!

రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పత్తి రైతుల కోసం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. రైతులు తమ పత్తిని నేరుగా ఈ కేంద్రంలోనే విక్రయించాలని అధికారులు సూచించారు. కనీస మద్దతు ధర రూ.8,110గా ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు కేంద్రంలో పారదర్శక తూకం, న్యాయమైన ధర, తక్షణ చెల్లింపు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News November 13, 2025
విజయనగరం జిల్లా పత్తి రైతులకు గమనిక

జిల్లా పత్తి రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటను విక్రయించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బుధవారం విజ్ఞప్తి చేశారు. దళారీలను, మధ్యవర్తులను నమ్మవద్దని రైతులను హెచ్చరించారు. రైతులు పత్తిని ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.8,110 కంటే తక్కువకు విక్రయించవద్దని సూచించారు. ఇప్పటికే పత్తి సాగు ఉన్న 140 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
News November 12, 2025
VZM: ‘జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి’

డిసెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్అదాలత్ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.భబిత పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. రాజీ కాదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కరించాలని సూచించారు. వారెంట్ పెండింగ్, గంజాయి, పోక్సో కేసుల ముద్దాయిలకు అవగాహన కల్పించి నేరాలను తగ్గించాలని పేర్కొన్నారు.


