News October 15, 2024

విజయనగరంలో విద్యుత్ శాఖ కంట్రోల్ రూం

image

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ అన్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూడాలని, అవసరమైన యంత్రాంగం, పరికరాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఎస్ఈ, ఈఈలను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ ప్రమాదాలు గుర్తిస్తే టోల్ ఫ్రీ నెం. 1912 లేదా కంట్రోల్ రూమ్ నెం. 94906 10102 తెలియజేయాలన్నారు.

Similar News

News May 8, 2025

ప్రేమ పేరుతో మోసగించిన వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష: SP

image

బొబ్బిలి పోలీస్ స్టేషన్‌లో 2022లో నమోదైన మహిళను మోసం చేసిన కేసులో సీతయ్యపేట వాసి దివనాపు అఖిల్ అంబేత్కర్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ.15వేల జరిమానాను కోర్టు విధించిందని SP వకుల్ జిందల్ గురువారం తెలిపారు. నిందితుడు పాచిపెంటకు చెందిన మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి,శారీరకంగా అనుభవించి మోసం చేశాడనే ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామన్నారు. ఆధారాలతో కోర్టులో ప్రవేశపెట్టగా నిందితుడికి శిక్ష ఖరారు అయిందన్నారు.

News May 8, 2025

VZM: పతకాలు సాధించిన పోలీసులకు ఎస్పీ అభినందన

image

ఇటీవల కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో నిర్వహించిన జాతీయస్థాయి డెడ్ లిఫ్ట్ & బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో వన్ టౌన్ ASI త్రినాథ్, విశ్రాంత HC శంకర్రావు పతకాలు సాధించారు. వారు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP వకుల్ జిందల్‌ను కలిశారు. ఎస్పీ వాళ్ల ప్రతిభను అభినందించి క్రీడాస్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. 4 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు.

News May 7, 2025

ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలి: కలెక్టర్

image

ఉపాధి వేతనదారులకు దినసరి వేతనం పెరిగేలా పనులు చేయించాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధి పనుల తీరు, వేతనదారులు అందుకుంటున్న సగటు వేతనంపై సమీక్షించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలని చెప్పారు. ఉదయాన్నే వీలైనంత వేగంగా పని మొదలయ్యేలా చూడాలన్నారు. రెండుపూటలా కనీసం 6 గంటలు పనులు చేయించాలని ఆదేశించారు.