News October 8, 2024

విజయనగరంలో సుద్దాల అశోక్ తేజ పర్యటన

image

అమ్మ వంటి మాతృభాషను గౌరవించుకోవాలని, తెలుగు భాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పరిపాలన అధికారి డాక్టర్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Similar News

News September 15, 2025

VZM: నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.

News September 14, 2025

రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ఈ నెల 15న సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.

News September 14, 2025

17న జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు

image

ఈనెల 17న రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు జిల్లా బంద్ చేపడతామని కార్మిక సంఘ నాయకులు తెలిపారు. శనివారం చీపురుపల్లిలో బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఫ్రీ బస్సుతో రోడ్డున పడ్డ ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.25 వేలు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీవో వేధింపులు, ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదం, రాజాం డ్రైవర్లు పాల్గొన్నారు.