News March 8, 2025

విజయనగరంలో 3వేల మంది మహిళలతో ర్యాలీ: కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజీవ్ క్రీడా ప్రాంగణంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్ అంబేడ్క‌ర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత హాజరుకానున్నారని వెల్లడించారు. 3వేల మంది మహిళలతో ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుంచి రాజీవ్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 24, 2026

VZM: మార్చి 8న గురుకుల పాఠశాల్లో ప్రవేశ పరీక్ష

image

విద్యా సంవత్సరంలో ఏపీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 6-10వ తరగతులకు మార్చి 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విజయనగరం జిల్లా కోఆర్డినేటర్‌ ఎం.మాణిక్యం తెలిపారు. 5వ తరగతి ఇంటర్ ప్రవేశ పరీక్ష యధావిధిగా మార్చి1న జరుగుతుందన్నారు. సమ్మేటివ్ అసెస్మెంట్‌టు పరీక్షలు ఉన్న కారణంగా 6, 7, 8, 9, 10వ తరగతులకు మార్చి 2న జరగాల్సిన పరీక్ష వాయిదా వేసినట్లు ప్రకటించారు.

News February 24, 2026

భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, తదితర పనుల పురోగతిని సమీక్షించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రహదారి, కాలువలు, ఎస్టీపీలు, ఒబేరాయ్ హోటల్‌కు సంబంధించిన భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలన్నారు.

News February 24, 2026

చీపురుపల్లిలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

సీఎం చంద్రబాబు ఈనెల 28న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం 28న ఉదయం 11 గంటలకు చీపురుపల్లి మండలం రావివలసకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. 11.20 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావేదిక మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం 1.40 నుంచి 2.25 వరకూ పైలపేటలోని లబ్ధిదారులను కలుస్తారు. 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రావివలసలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం తిరుగుపయనమౌతారు.