News October 24, 2024

విజయనగరంలో TODAY TOP NEWS

image

>గుర్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు పర్యటన>జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు>తీర ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ అంబేడ్కర్>ఉచిత బస్సు ప్రయాణంపై కాంగ్రెస్ పోస్ట్ కార్డు ఉద్యమం>జిల్లాలో హోంమంత్రి అనిత రేపు పర్యటన>తాత్కాలిక బాణసంచా వ్యాపారులకు కీలక సూచనలు>జిల్లాలో రాత్రి 11 తర్వాత తిరిగితే కేసులు నమోదు 

Similar News

News November 23, 2024

VZM: సంక్రాంతి నాటికి జిల్లాలో గుంతలు లేని రోడ్లు

image

విజయనగరం జిల్లాకు 176 రోడ్ల ప‌నులు మంజూరయ్యాయి. రూ.23.51 కోట్ల‌తో ఈ ప‌నులను R&B శాఖ చేప‌డుతుంది. ఇందులో భాగంగా 750 కిలోమీట‌ర్ల రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు జరగనున్నాయి. తొలివిడ‌త‌లో 68 ప‌నులకు రూ.10.54 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటిలో ఇప్పటికే 61 ప‌నుల‌కు టెండ‌ర్లు ఖ‌రారయ్యాయి. సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 23, 2024

విజయనగరం: మొదట ప్రేమ.. ఆపై చీటింగ్

image

మహిళను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు విజయనగరం DSP శుక్రవారం తెలిపారు. గంట్యాడలోని కిర్తిబర్తికి చెందిన వెంకట సత్యం ఓ కళాశాలలో ఫ్యాకల్టీగా చేసేవాడు. అదే కళాశాలలో ఫ్యాకల్టీగా ఉన్న దళిత మహిళకు ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకుని పెళ్లికి నిరాకరించారు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడిని గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.

News November 23, 2024

విజయనగరంలో నేటి నుంచి T20 .. షెడ్యూల్ ఇదే

image

స్థానిక PVG రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు ACA అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం నుంచి ఉదయం 11 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి రోజు అస్సాం–రైల్వేస్‌, 25న ఒడిస్సా–రైల్వేస్, 27న విదర్భ–పుదిచ్చేరి, 29న చండీగఢ్‌–ఛత్తీస్‌గఢ్‌, డిసెంబర్1న అస్సాం–పుదిచ్చేరి, 3న ఛత్తీస్‌గఢ్‌–విదర్భ, 5న చండీగఢ్‌–ఒడిశా జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.