News October 19, 2024

విజయనగరంలో TODAY TOP NEWS

image

> బొబ్బిలి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి > విజయనగరం జిల్లావ్యాప్తంగా ఐదో రోజు పల్లె పండగ వార్షికోత్సవాలు> గుర్లలో మెడికల్ క్యాంపులో కుప్పకూలిన ఏఎన్ఎం > మంత్రి కొండపల్లి చొరవతో రోడ్ల నిర్మాణాలకు నిధుల విడుదల> రామతీర్ధం గిరి ప్రదక్షిణ రహదారికి ఎమ్మెల్యే నాగమాధవి శంకుస్థాపన > గుర్లలో కలెక్టర్ అంబేద్కర్ పర్యటన

Similar News

News November 8, 2024

VZM: గంజాయితో ఆరుగురు యువకులు అరెస్ట్

image

విజయనగరంలో గంజాయిని చిన్న మొత్తాల్లో విక్రయిస్తున్న ఆరుగురు యువకులను వన్ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ.. విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు చెందిన యువకులు చెడు వ్యసనాలకు అలవాటుపడ్డారన్నారు. వారి అవసరాలకు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొని వచ్చి, చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి, విక్రయిస్తున్నట్లు గుర్తించి దాడులు చేయగా 2 కిలోల గంజాయి లభించిందన్నారు.

News November 8, 2024

VZM: బాధితులకు 300 ఫోన్లు అప్పగింత

image

విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న ఫోన్లను పోలీసులు ట్రేస్ చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా బాధితులకు 300 ఫోన్లను తిరిగి అప్పగించారు. పోగొట్టుకున్న ఫోన్లను తక్కువ వ్యవధిలోనే తిరిగి తమకు అప్పగించిన సైబర్ సెల్ పోలీసులకు, ఎస్పీకు బాధితులు కృతజ్ఞతలు తెలిపి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్య లత పాల్గొన్నారు.

News November 8, 2024

‘విజయనగరం ఎమ్మెల్సీ స్థానానికి పోటీ’

image

ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా డా.రంగుముద్రి శివ నరేంద్ర నాయుడు పోటీ చేస్తున్నట్లు తెలిపారు. బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన ఈయన గతంలో వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. వైసీపీ ఓటమి అనంతరం ఆయన పదవికి రాజీనామా చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి సంబంధించి ఈనెల 11న నామినేషన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు.