News June 5, 2024
విజయనగరం: అన్న చేతిలో తమ్ముడి దారుణ హత్య
అన్న చేతిలో తమ్ముడు దారుణ హత్యకు గురైన ఘటన సీతానగరం మండలంలో తీవ్ర కలకలం రేపింది. రూరల్ సీఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెదభోగిలికి చెందిన గుజ్జల రవీంద్ర, హేమంత్ అన్నదమ్ములు. మంగళవారం సాయంత్రం వారి మధ్య గొడవ రావడంతో హేమంత్‌ని అన్న రవీంద్ర కత్తెరతో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు.
Similar News
News November 4, 2024
VZM: నేటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు స్వీకరణ
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి సోమవారం నుంచి విజయనగరం జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 గంటలకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 11:00 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
News November 4, 2024
‘పార్వతీపురం మన్యం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి’
పార్వతీపురం మన్యం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రెండవ రోజు దీక్షలను కొనసాగించారు. ఈ ప్రభుత్వం విద్యా రంగ సమస్యలపై దృష్టి సారించి తక్షణమే వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేసి విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
News November 3, 2024
విజయనగరం బీసీ హాస్టల్ విద్యార్థి మృతిపై మంత్రి దిగ్బ్రాంతి
విజయనగరం బీసీ హాస్టల్ విద్యార్థి మృతిపై మంత్రి సవిత తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఏడో తరగతి చదువుతున్న కొణతాల శ్యామలరావు బ్రేక్ ఫాస్ట్ తిన్న తరువాత కళ్లు తిరుగుతున్నాయని తోటి విద్యార్థులకు తెలిపి అపస్మారకస్థితిలోకి వెళ్లి ఆకస్మికంగా మృతి చెందాడు. శ్యామలరావు మృతికి కారణాలు తెలపాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధితుని కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.