News November 22, 2024

విజయనగరం: ఈ చిట్టితల్లి.. చిరంజీవి..!

image

గంటాడ్య మండలంలోని మురపాక గ్రామానికి చెందిన గండి వెంకటరమణ, దేవి దంపతుల చిన్న కుమార్తె పల్లవి(12) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. బ్రెయిన్ డెడ్ కావడంతో ఇక బతికే అవకాశాలు లేవని వైద్యులు తేల్చేశారు. పుట్టెడు బాధలో ఉన్న ఆ దంపతులు.. తమ చిట్టితల్లి మరొకరికి ప్రాణదాత అవుతుందని భావించారు. కుమార్తె అవయవాలు దానం చేసేందుకు అంగీకరించి, మానవత్వాన్ని చాటుకున్నారు.

Similar News

News November 23, 2024

VZM: మహిళ ఎమ్మెల్యేలతో హోంమంత్రి సెల్ఫీ

image

ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగియడంతో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు శుక్రవారం సందడి చేశారు. మహిళా ఎమ్మెల్యేలందరూ ఓ చోట చేరి సరదాగా గడిపారు. రాష్ట్ర హోంమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనిత సెల్ఫీ తీయగా.. ఆమెతో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఫోటో దిగారు.

News November 22, 2024

VZM: జిల్లాలో కనిపించని మాజీలు

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేల జాడ కనిపించడం లేదు. కనీసం పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు సొంతపార్టీ నుంచే వినిపిస్తున్నాయి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సైతం ఎవరినీ కలవడానికి ఇష్టపడడం లేదని సమాచారం. పదవిలో ఉన్న ఎమ్మెల్సీ పెనుమత్స కూడా అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి.

News November 22, 2024

ఇక నుంచి స్థానికంగా ప్రజా పరిష్కార వినతుల స్వీకరణ: JC

image

ఇకపై ప్రతి సోమవారం మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిల్లో ప్రజా వినతుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుందని JC సేతు మాధవన్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎంపీడీవో, తహసిల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ తదితరులతో కూడిన మండల స్థాయి సమన్వయ కమిటీ నిర్వహించాల్సి ఉంటుందన్నారు.