News July 12, 2024
విజయనగరం: ఉచిత ఇసుక సరఫరాపై టోల్ ఫ్రీ నంబరు

ఉచిత ఇసుక సరఫరాకు సంబంధించి సమాచారం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది. సమాచారం, ఫిర్యాదుల కోసం 18004 256014 టోల్ ఫ్రీ నంబరుకు, ఆ నంబర్ అందుబాటులోకి రాకుంటే 90323 38135 ఫోన్ నంబరును సంప్రదించవచ్చునని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ఇసుక వినియోగదారులు గమనించాలని కోరింది.
Similar News
News July 11, 2025
జిందాల్ రైతులకు చట్టప్రకారమే పరిహారం: కలెక్టర్

జిందాల్ భూములకు సంబంధించి మిగిలిన రైతులకు పరిహారాన్ని వారం రోజుల్లో అందజేయాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిందాల్‌కు కేటాయించిన భూములకు సంబంధించి విజయనగరంలోని తమ ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఇప్పటివరకు చెల్లించిన పరిహారం, పెండింగ్ బకాయిలపైనా ఆరా తీశారు. 28 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి 15 మందికి పరిహారం అందజేయాల్సి ఉందని తెలిపారు.
News July 11, 2025
సీజనల్ వ్యాధులను అరికట్టాలి: కలెక్టర్

సీజనల్ వ్యాధులు విజృంభించకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా కట్టుధిట్టంగా చర్యలు తీసుకోవాలన్నారు.
News July 11, 2025
అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన

విజయనగరంలోని పోలీసు సంక్షేమ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి SP వకుల్ జిందల్ గురువారం శంకుస్థాపన చేశారు. రెండు అంతస్తుల్లో నాలుగు తరగతి గదుల నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో తక్కువ ఫీజులతో పోలీసుల పిల్లలకు, ఇతర విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవనాలు నిర్మిస్తున్నామన్నారు.