News December 16, 2024

విజయనగరం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో అరుదైన లేగ దూడ జననం

image

విజయనగరం జిల్లా, రామభద్రపురం మండలం, ఆరిక తోట వెటర్నరీ డిస్పెన్సరీ పరిధిలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన మొదటి ఆడ దూడ ఆదివారం జన్మించింది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ(IVF-ET) ద్వారా సంకరజాతి ఆవు మేలు జాతి గిర్ ఆడ దూడకు జన్మనిచ్చిందని పశువైధ్యాధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మొదటి ఆడ దూడ కావడం విశేషమని పశువైద్యాధికారి డాక్టర్ డి.సురేశ్‌కు ఉన్నతాధికారులు తెలిపారు.

Similar News

News November 18, 2025

విజయనగరంలో ఈనెల 20న జాబ్ మేళా

image

విజయనగరం MR కాలేజీలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీద సోమవారం తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ, ATC టైర్స్, మెడ్ ప్లస్ సంస్థలలో కలిపి 195 పోస్టులు భర్తీ చేయనున్నారని, అభ్యర్థులు ముందుగా employment.ap.gov.inలో నమోదు చేసుకుని, సర్టిఫికెట్లు, బయోడేటా, 2 ఫొటోలతో జాబ్ మేళాకు హాజరవ్వాలన్నారు. డిగ్రీ, పీజీ, ANM, GNM, ఫార్మసీ, ఐటీఐ, SSC చదివిన వారు అర్హులుగా పేర్కొన్నారు.

మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలు అందించండి: VZM SP

image

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘ఓ ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్‌ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్‌సైట్‌కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోమ్‌లకు తరలించి చికిత్స అందించనున్నట్లు చెప్పారు.