News December 16, 2024
విజయనగరం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో అరుదైన లేగ దూడ జననం
విజయనగరం జిల్లా, రామభద్రపురం మండలం, ఆరిక తోట వెటర్నరీ డిస్పెన్సరీ పరిధిలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన మొదటి ఆడ దూడ ఆదివారం జన్మించింది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ(IVF-ET) ద్వారా సంకరజాతి ఆవు మేలు జాతి గిర్ ఆడ దూడకు జన్మనిచ్చిందని పశువైధ్యాధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మొదటి ఆడ దూడ కావడం విశేషమని పశువైద్యాధికారి డాక్టర్ డి.సురేశ్‌కు ఉన్నతాధికారులు తెలిపారు.
Similar News
News January 16, 2025
VZM: కానిస్టేబుల్ ఎంపికలు.. 185 మంది గైర్హాజరు
విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుఢ్య ఎంపిక ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 415 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. 185 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కాగా ఎంపిక ప్రక్రియ శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి జరిగింది.
News January 16, 2025
VZM:రహదారి నిబంధనలను పాటించాలి:కలెక్టర్
రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతీఒక్కరూ నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోరారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను కలెక్టర్ తమ ఛాంబర్‌లో గురువారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే 90 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలను పాటించడం ద్వారా వీటిని నివారించవచ్చున్నారు.
News January 16, 2025
సీతానగరం: సువర్ణముఖి నదిలో పడి యువకుడి మృతి
సువర్ణముఖి నదిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వివరాల మేరకు పెదబోగిలి గ్రామానికి చెందిన ఎస్.అనుదీప్ (27) బంధువులతో కలిసి స్నానానికి వచ్చాడు. ఇసుక కోసం తవ్విన గోతిలో అనుదీప్ మునిగిపోవడంతో బంధువులు గుర్తించి బయటకు తీసి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.