News October 11, 2024

విజయనగరం ఉత్సవాల్లో ఈవెంట్స్ జరిగే ప్రాంతాలివే..

image

విజయనగరం-2024 ఉత్సవాలను ఆదివారం ఉ.11 గంటలకు అయోధ్య మైదానంలో పలువురు ప్రజాప్రతినిధులు హాజరై ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
వేదికలు: అయోధ్య మైదానం, మహారాజ కోట, గురజాడ కళాక్షేత్రం, విజ్జీ స్టేడియం, రాజీవ్ స్టేడియం, ఆనంద గజపతి కళాక్షేత్రం, ఎంఆర్ లేడీస్ రిక్రియేషన్ క్లబ్, లయన్స్ కమ్యూనిటీ హాల్, బొంకుల దిబ్బ, కోట, మన్సాస్ మైదానం(లోవర్ ట్యాంక్ బండ్ రోడ్).

Similar News

News November 3, 2024

పార్వతీపురం: సోమవారం గ్రీవెన్స్ రద్దు

image

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించడం లేదని దీన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. దూరప్రాంతాల నుంచి అనవసరంగా వ్యయ ప్రయాసలకు ఓర్చి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

News November 3, 2024

పార్వతీపురం: జిల్లాలో నైపుణ్య గణన పక్కాగా చేపట్టాలి

image

జిల్లాలో నైపుణ్య గణన 2024ను పక్కాగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నైపుణ్య గణన 2024పై ఎంపిడిఓలతో కలెక్టర్ సమీక్షించారు.  కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 15 నుంచి 59 ఏళ్ల లోపు వయస్సుగల వారి పూర్తి వివరాలను నైపుణ్య గణనలో నమోదుచేయించాలని అన్నారు.

News November 2, 2024

విజయనగరం: 4న గ్రీవెన్స్ ర‌ద్దు

image

ఈ నెల 4వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో జ‌ర‌గాల్సిన ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (గ్రీవెన్స్‌) కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రావ‌డంతో గ్రీవెన్స్ రద్దు చేశామన్నారు. ఈ విష‌యాన్ని అర్జీదారులు గ‌మ‌నించాల‌ని ఆయ‌న కోరారు.