News October 2, 2024
విజయనగరం ఉత్సవాల భద్రత ఏర్పాట్లపై సమీక్ష
జిల్లాలో ఈనెల 13న నిర్వహించే విజయనగరం ఉత్సవాలు, ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పైడిమాంబ తొలేళ్ళు, సిరిమానోత్సవంకు చేపట్టే భద్రత, బందోబస్తు ఏర్పాట్లుపై ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. పండగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. శాంతియుతంగా నిర్వహించే విధంగా భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 5, 2024
VZM: దసరా ఉత్సవాల్లో అల్లర్లు జరగకుండా చూడాలి
విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఊరేగింపులు, నిమజ్జనాలు శాంతియుతంగా ముగిసే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. చెరువులు, నదులు వద్ద ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అవగాహన కల్పించాలన్నారు.
News October 5, 2024
ఉమ్మడి విజయనగరం జిల్లాలో పెట్రోల్ ధర
విజయనగరం జిల్లాలో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ.108.96గా ఉంది. నిన్నటితో పోల్చితే ఈ రోజు కొంతమేర తగ్గింది. గత పది రోజులలో లీటర్ పెట్రోల్ రూ.108.69 – 109.52 మధ్యలో కొనసాగింది. డీజిల్ లీటర్ రూ.96.80గా ఉంది. గత పది రోజులలో దీని రేటు రూ.96.55 నుంచి 97.32 మధ్యలో ఉంటోంది. ఇటు పార్వతీపురం జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.38 కాగా డీజిల్ రూ.98.11గా ఉంది.
News October 5, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. విజయవాడ BLP రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కార్మికులు భద్రత కోసం ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వారికి హాని తలపెట్టమని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.