News March 23, 2024
విజయనగరం: ఉపాధ్యాయుడు సస్పెండ్

ప్రభుత్వ నివాస గృహాన్ని రాజకీయ కార్యకలాపాలకు వినియోగించుకోవడం పై ఉపాధ్యాయుడు అడ్డాకుల సన్యాసి నాయుడును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవ నాయుడు శనివారం ధ్రువీకరించారు. కురుపాం ఎన్నికల అధికారి ఇచ్చిన నివేదిక మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
పొక్సో కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు: VZM SP

విజయనగరానికి చెందిన వి.రవి (49)పై 2025లో నమోదైన పోక్సో కేసులో 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ తెలిపారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి కోర్టులో ఆధారాలు సమర్పించడంతో శిక్ష పడిందన్నారు. బాధితురాలికి రూ.50 వేల పరిహారం మంజూరు చేసినట్లు స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
News November 28, 2025
సదరం రీ-అసెస్మెంట్ జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

విజయనగరం జిల్లాలో NTR భరోసా పింఛన్ రీ-అసెస్మెంట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సదరం రీ-అసెస్మెంట్ కార్యక్రమంపై ఆయన శుక్రవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రీ-అసెస్మెంట్లో జాప్యం జరుగుతుండటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News November 27, 2025
గంజాయి కేసులో ఐదుగురికి జైలు శిక్ష: VZM SP

డ్రగ్స్ కేసులో ఐదుగురు నిందితులకు 18 నెలల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి మీనాదేవి గురువారం తీర్పు వెలువరించారని విజయనగరం ఎస్పీ దామోదర్ తెలిపారు. విజయనగరంలోని వన్ టౌన్ పోలీస్స్టేషన్లో జూలై 26, 2024న పాత రైల్వే క్వార్టర్స్ వద్ద 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను సమర్పించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.


