News March 28, 2025

విజయనగరం: ఉప ఎన్నికల్లో YCP క్లీన్ స్వీప్

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాల్లో గురువారం నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. భోగాపురం వైస్ ఎంపీపీగా పచ్చిపాల నాగలక్ష్మి (వైసీపీ) ఎన్నిక కాగా, వివిధ మండలాల్లో మరో పది స్థానాల్లో జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంతకవిటి మండలంలోని మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడిగా వైసీపీకి చెందిన షేక్ హయ్యద్ బీబీ ఎన్నికయ్యారు.

Similar News

News October 29, 2025

విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో తుఫాన్ కారణంగా జరిగిన నష్టాల అంచనాలను తక్షణం పంపించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు బుధవారం ఆదేశించారు. శాఖలవారీగా నిజమైన వివరాలు, ఫొటోలు సహా అంచనాలు పంపాలని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల బియ్యం సహాయాన్ని వెంటనే అందించాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో 24 గంటలు కృషి చేసిన అధికారులు, సచివాలయ సిబ్బందిని అభినందించారు.

News October 29, 2025

గజపతినగరంలో రోడ్డు ప్రమాదం.. కారు దిగిన కలెక్టర్

image

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ఉన్న కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గజపతినగరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని బుధవారం గమనించారు. వాహనాన్ని ఆపి గాయపడిన వ్యక్తులకు ధైర్యం చెప్పారు. అనంతరం అంబులెన్సును ఏర్పాటు చేయించి తక్షణ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గోల్డెన్ అవర్‌లో అందించిన సాయం మనిషి ప్రాణాలను కాపాడుతుందని, ప్రాణం కంటే విలువైనది మరేమీ లేదన్నారు.

News October 29, 2025

రేషన్ సరకుల పంపిణీ శతశాతం పూర్తి కావాలి: VZM కలెక్టర్

image

రేష‌న్ పంపిణీ బుధవారం లోగా శ‌త‌శాతం పూర్తి కావాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో మంగళవారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. న‌వంబ‌రు నెల రేష‌న్ స‌రకుల పంపిణీని ముందుగానే చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింద‌ని, ఇప్ప‌టికే జిల్లాలో పంపిణీ మొద‌ల‌య్యింద‌ని చెప్పారు. బుధ‌వారం నాటికి అన్ని గ్రామాల్లో శ‌త‌శాతం పూర్తి చేయాల‌ని ఆదేశించారు.