News April 19, 2024

విజయనగరం: ఊపందుకున్న నామినేషన్లు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో నామినేష‌న్ల ప‌ర్వం ఊపందుకుంది. రెండో రోజు విజ‌య‌న‌గ‌రం ఎంపీ స్థానానికి 6, అసెంబ్లీ స్థానాల‌కు 31 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. విజయనగరం-4, గజపతినగరం-8, చీపురుపల్లి-3, ఎస్.కోట-4, నెల్లిమర్ల-6, బొబ్బిలి-6 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. అటు మన్యం జిల్లాలో అరకు ఎంపీ స్థానానికి 4, కురుపాం-1, సాలూరు-2, పార్వతీపురం-2 నామినేషన్లు దాఖలయ్యాయి.

Similar News

News September 10, 2024

బొబ్బిలి : నెలరోజులకే రూ.94లక్షలు గంగార్పణం

image

పారాది వద్ద వేగావతి నదిపై రూ.94 లక్షలు వెచ్చించి నిర్మించిన కాజ్వే నెల రోజులుకే గంగ పాలైంది. ఇప్పటికే నాలుగుసార్లు మరమ్మతులు చేశారు. ఈసారి వర్షాలకు ఐదు రోజులుగా నీరు పారడంతో సగం వరకు పాడైపోయింది. పూర్తిస్థాయిలో మరమ్మ తులు చేస్తే కానీ వాహనాల రాకపోకలకు వీలు ఉండదని అధికారులు అంటున్నారు. నీరు పూర్తిగా తగ్గిన తర్వాతే మరమ్మతులు చేస్తామని ఏఈ రాజు తెలిపారు.

News September 10, 2024

పెరిగిన తోటపల్లి నీటి మట్టం

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో 3,710 క్యూసెక్కులగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తివేసి 2,777 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కాల్వల ద్వారా 190 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 2.5 టీఎంసీలకు కాగా.. ప్రస్తుతం 1.858 టీఎంసీలు ఉందన్నారు.

News September 10, 2024

VZM: ‘నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్సుల పోస్టులు భర్తీ చేయాలి’

image

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 115 జీవోను వెంటనే రద్దు చేయాలని మహారాజా ఆసుపత్రి నర్సులు డిమాండ్‌ చేశారు. ఏపీ నర్స్‌ స్ట్రగుల్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ.. జీవోను రద్దు చేసి నోటిఫికేషన్‌ ద్వారా స్టాఫ్‌ నర్సు పోస్టులు భర్తీ చేయాలన్నారు. నర్సింగ్‌ కోర్సులు చదివి ప్రభుత్వాసుపత్రిలో సేవలు చేస్తున్నామని, సచివాలయాల్లో పనిచేస్తున్న ANM లను స్టాఫ్‌ నర్సులుగా పెట్టడం సరికాదన్నారు.