News May 12, 2024
విజయనగరం ఎంపీ అభ్యర్థికి ప్రధాని మోదీ లేఖ

విజయనగరం ఎంపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుని విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆ లేఖను కలిశెట్టి విడుదల చేశారు. జర్నలిస్టుగా విజయనగరం అభివృద్ధి, సమస్యలపై లోతైనా అవగాహన ఉండటం, క్షేత్ర స్థాయిలో ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి ప్రవేశించడం అభినందనీయమని లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.
Similar News
News February 16, 2025
నెల జీతం విరాళంగా ఇచ్చిన విజయనగరం ఎంపీ

తలసేమియాతో బాధపడుతున్న రోగుల చికిత్స నిమిత్తం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. విజయవాడలో తలసేమియా రోగుల కోసం శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఏడాది రోగుల కోసం తన వంతుగా ఒక నెల జీతాన్ని అందజేస్తానని ఎంపీ తెలిపారు. ఈ మొత్తాన్ని ఎన్టీఆర్ ట్రస్టుకు జమచేస్తానని వెల్లడించారు.
News February 16, 2025
వారి లైసెన్సులను రద్దు చేస్తాం: VZM కలెక్టర్

ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని, ఇక పై నిబంధనలు పాటించని వారి లైసెన్స్‌ను రద్దు చేస్తామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. వేగం కన్నా సురక్షితంగా చేరడం ముఖ్యమని, ప్రతి వాహన దారుడు తాను సురక్షితంగా ఉంటూ పక్క వారిని కూడా సురక్షితంగా ఉంచాలని అన్నారు.
News February 15, 2025
వారిని కచ్చితంగా శిక్షించాలి: SP వకుల్ జిందాల్

NDPS((నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) కేసుల్లో నిందితులు కచ్చితంగా శిక్షించాలిలని SP వకుల్ జిందాల్ అన్నారు. విశాఖ డిఐజి గోపీనాథ్ జెట్టి ఆదేశాలతో దర్యాప్తులో మెలకువలు నేర్పేందుకు శనివారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. NDPS చట్టం చాలా కఠినమైనదని, చట్టంలో పొందుపరిచిన విధివిధానాలను దర్యాప్తు అధికారులు పాటిస్తే నిందితులు తప్పనిసరిగా శిక్షింపబడతారన్నారు.