News June 4, 2024
విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ ముందంజ
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. 1వ రౌండ్‌లో కలిశెట్టి అప్పలనాయుడుకి 6,687 ఓట్లు పోలవ్వగా.. చంద్రశేఖర్‌కి 3,772 ఓట్లు పడ్డాయి. అప్పలనాయుడు 2,915 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.
Similar News
News November 8, 2024
గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌లో కోమటిపల్లి వ్యక్తి మృతి
గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌లో బొబ్బిలి సమీపంలోని కోమటిపల్లికి చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముత్యాల లక్ష్మణరావు (54) కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ట్రైన్ బాత్రూంలో మృతి చెందాడు. తోటి ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
News November 8, 2024
బడి బయట 10వేల మంది: కలెక్టర్ కీలక ఆదేశాలు
జిల్లాలో బడిబయట ఉన్న పిల్లలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో విద్యార్థి వారీగా నివేదిక రూపొందించాలని కలెక్టర్ అంబేడ్కర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న విద్యార్థుల సంఖ్య దృష్ట్యా సుమారు పదివేల మంది బడి బయట ఉండవచ్చని డీఈఓ తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వారిపై అధ్యయనం చేయాలని ఆదేశించారు.
News November 7, 2024
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
విజయనగరానికి చెందిన కుమిలి సురేశ్‌కు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు SP వకుల్ జిందాల్ గురువారం తెలిపారు. ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడనే ఫిర్యాదుతో స్థానిక మహిళా పోలీసు స్టేషన్లో 2021లో పోక్సో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టగా నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పు వెల్లడైందన్నారు.