News April 28, 2024

విజయనగరం: ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమం

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున చిన్న తప్పు కూడా జరగకుండా అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో రిసెప్షన్ సెంటర్ల ఇన్‌ఛార్జ్‌లు, అధికారులు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అధికారులకు అప్పగించిన విధుల పట్ల పూర్తి అవగాహనా కలిగి ఉండాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.

Similar News

News November 9, 2024

VZM: ‘10వ తేదీలోగా రహదారి మరమ్మతులు ప్రారంభించాలి’

image

గుంతలు లేని రహదారుల నిర్మాణంలో భాగంగా విజయనగరం జిల్లాలో చేపడుతున్న 68 రహదారి మరమ్మతుల పనులన్నిటినీ సోమవారంలోగా ప్రారంభించాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో 932 కిలో మీటర్ల రహదారి మరమ్మత్తుల పనులను జనవరి నాటికి పూర్తి చేయవలసి ఉన్నందున వెంటనే పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం R&B అధికారులతో రహదారి మరమ్మత్తుల పనులపై ఆయన ఛాంబర్లో సమీక్షించారు.

News November 9, 2024

VZM: విద్యుత్ భవన్‌లో ఫైర్ సేఫ్టీ పై అవగాహన

image

విజయనగరం జిల్లా స్థానిక దాసన్నపేట విద్యుత్ భవన్‌లో విద్యుత్ అధికారులు, సిబ్బందికి గత మూడు రోజులుగా NPTI బెంగళూరు ఆధ్వర్యంలో భద్రతా విపత్తులు మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఫైర్ సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించారు. అగ్ని ప్రమాదాలను నివారించే సమయంలో తగు జాగ్రత్తలను వివరించారు.

News November 9, 2024

VZM: ఫోన్ పోయిందా? అయితే ఇలా చేయండి!

image

పోగొట్టుకున్న ఫోన్లను ట్రేస్ చేసేందుకు ప్రత్యేకంగా మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ విధానాన్ని జిల్లాలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బాధితులు 8977945606 నంబర్‌కి మెసేజ్ చేస్తే గూగుల్ ఫారం వస్తుందని, అందులో వివరాలు పొందుపరిస్తే ఫోన్ ను ట్రేస్ చేసి బాధితులకు అప్పగిస్తామన్నారు. ఫోన్ పోతే ఇకపై సైబర్ సెల్ కార్యాలయానికి రావాల్సిన పనిలేదన్నారు.