News August 26, 2024

విజయనగరం: ‘ఎమ్మెల్సీ అభ్యర్థిగా రఘువర్మ’

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC అభ్యర్థిగా APTF-57 తరఫున రెండోసారి పాకలపాటి రఘువర్మ పోటీ చేయనున్నారు. ఈ మేరకు విజయనగరంలో ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీచర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తిని బరిలో ఉంచుతున్నట్లు కార్యవర్గం పేర్కొంది. త్వరలో ప్రచారం మొదలుపెడతామని వెల్లడించింది. సంఘం పరంగా ఆయన గెలుపునకు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చింది.

Similar News

News October 7, 2024

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ షెడ్యూల్ ఇదే

image

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఉదయం 8 గంటలకు బొండపల్లి మండలం ముద్దూరు గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

News October 6, 2024

దళారుల బారిన పడి మోసపోవద్దు: VZM కలెక్టర్

image

కేజీబీవీలో ఉద్యోగాలకు కొంతమంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల ఎంపిక ఉంటుందని, దళారులబారిన పడి అభ్యర్థులు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. డబ్బులు వసూలు చేస్తున్న వారి వివరాలు తమకి తెలియజేయాలని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

News October 6, 2024

విజయనగరం జిల్లా టెట్ అభ్యర్థులకు కీలక UPDATE

image

విజయనగరం జిల్లాలోని టెట్ అభ్యర్థులకు హాల్ టికెట్, నామినల్ రోల్‌లో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నట్లు డీఈవో ప్రేమ కుమార్ తెలిపారు. ఇందుకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. ఇంటిపేరు, బర్త్ డే మార్పుల కోసం టెన్త్ మార్కుల లిస్ట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఏదైనా గుర్తింపు కార్డును ఎగ్జామ్ సెంటర్ల వద్ద అధికారులకు అందజేయాలని డీఈవో పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.