News August 26, 2024
విజయనగరం: ‘ఎమ్మెల్సీ అభ్యర్థిగా రఘువర్మ’
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC అభ్యర్థిగా APTF-57 తరఫున రెండోసారి పాకలపాటి రఘువర్మ పోటీ చేయనున్నారు. ఈ మేరకు విజయనగరంలో ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీచర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తిని బరిలో ఉంచుతున్నట్లు కార్యవర్గం పేర్కొంది. త్వరలో ప్రచారం మొదలుపెడతామని వెల్లడించింది. సంఘం పరంగా ఆయన గెలుపునకు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చింది.
Similar News
News September 7, 2024
VZM: వినాయక చవితి పూజలలో పాల్గొన్న మంత్రులు
విజయవాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన వినాయక చవితి పూజలలో ఉమ్మడి విజయనగరం జిల్లా మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేపట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్రంలోని ప్రజలు అందరు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేపట్టామని మంత్రి సంధ్యారాణి తెలిపారు.
News September 7, 2024
VZM: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో నమోదైన పోక్సో కేసు ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.11,500 జరిమానాను కోర్టు విధించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. గంట్యాడ మండలం పెంట శ్రీరాంపురం గ్రామానికి చెందిన గంధవరపు గోపి అనే వ్యక్తి ఓ మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఫిర్యాదుతో దర్యాప్తు చేయగా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నాగమణి తీర్పు చెప్పారన్నారు.
News September 7, 2024
సరుకు రవాణాలో సత్తా చాటుతున్న విశాఖ పోర్టు
సరుకు రవాణాలో విశాఖ పోర్టు సత్తా చాటుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. గత ఏడాది 35 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేయడానికి 163 రోజులు పట్టగా ఈ ఏడాది 149 రోజుల్లో ఈ లక్ష్యాన్ని చేరుకున్నట్లు పోర్ట్ ట్రస్ట్ అథారిటీ ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. ఈ ఏడాది 90 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.