News November 12, 2024

విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికకు మూడు నామినేషన్లు వ్యాలీడ్..!  

image

విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ పత్రాల స్క్రూటినీ రిటర్నింగ్ అధికారి సేతు మాధవన్, ఎన్నికల పరిశీలకులు ఎం.ఎం.నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం ఆయన ఛాంబర్‌లో జరిగింది. స్క్రూటినీ అనంతరం ముగ్గురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఎటువంటి అభ్యంతరాలు లేనందున వ్యాలీడ్‌గా జేసీ ప్రకటించారు. అభ్యర్థుల వివరాలను నోటీస్ బోర్డ్‌లో పెడతామని JC తెలిపారు.

Similar News

News December 7, 2024

విజయనగరం: RTC బస్సు ఢీకొని ఒకరి మృతి

image

విజయనగరం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. దత్తిరాజేరు మండలం పేదమానాపురంలో సంత జరిగింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వంగరకు చెందిన గెంజి మహేశ్, తిరండి నరసింహారావు, కొలుసు రమణ గొర్రెలతో సంతకు బయల్దేరారు. ఈక్రమంలో పార్వతీపురం నుంచి విజయనగరం వెళ్తున్న RTC బస్సు వీరిని ఢీకొట్టింది. మహేశ్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి.

News December 7, 2024

కంచరపాలెం అమ్మాయి కోసం గొడవ.. అరెస్ట్

image

విజయనగరానికి చెందిన సాయికుమార్ రెడ్డి(27) కంచరపాలెం యువతితో కలిసి పెదరుషికొండ వద్ద ఓ లాడ్జిలో 10రోజుల నుంచి ఉంటున్నారు. PMపాలేనికి చెందిన పి.వినయ్(23) ఆమెకు కాల్ చేయడంతో గురువారం బయటకు వెళ్లింది. తిరిగి మద్యం మత్తులో లాడ్జికి వచ్చిన యువతిని సాయి ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని ఆమె వినయ్‌కు చెప్పడంతో అతను తన ఫ్రెండ్స్‌తో కలిసి సాయిని దారుణంగా కొట్టారు. బాధితుడి ఫిర్యాదుతో వినయ్‌ను అరెస్ట్ చేశారు.

News December 7, 2024

VZM: జిల్లాలో నేడు జరగనున్న ముఖ్య కార్యక్రమాలు ఇవే

image

➤శనివారం ఉదయం 8.45 గంటలకు సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని కలెక్టర్ అంబేద్కర్ ప్రారంభిస్తారు➤ఉదయం 9-00 గంటలకు మలిశర్లలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొంటారు ➤ఉదయం 9-00 గంటలకు జామి మండలం కుమరాంలో మెగా టీచర్స్, పేరెంట్స్ డే కార్యక్రమంలో మంత్రి కొండపల్లి పాల్గొంటారు ➤ఉదయం 10-30 గంటలకు కలెక్టరేట్‌లో క్షయ వ్యాధి నియంత్రణ పై వంద రోజుల క్యాంపెయిన్ ప్రారంభం