News May 12, 2024

విజయనగరం: ఎలక్షన్@2024.. పోలింగ్ శాతం పెరిగేనా..?

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని నియోజకవర్గాల వారీగా 2019లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. కురుపాం-77.7%, పార్వతీపురం- 76.9%, సాలూరు- 79.4%, బొబ్బిలి- 78.9%,చీపురుపల్లి- 83.3%,గజపతినగరం- 86.9%, నెల్లిమర్ల- 87.9%, విజయనగరం- 70.8%, శృంగవరపుకోట- 86.1 శాతం నమోదైంది. మరి ఈ సంవత్సరం ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో మీ నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా.

Similar News

News October 22, 2025

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వండి: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదులను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. ప్రీ-ఆడిట్ పెండింగ్‌ ఫిర్యాదులను రెండు వారాల్లో 20% లోపు తగ్గించాలని, SLA గడువు దాటకూడదని స్పష్టం చేశారు. ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసే శాతం 10% కంటే ఎక్కువ కాకుండా చూడాలని సూచించారు.

News October 22, 2025

VZM: సీమంతం జరిగిన రెండో రోజే భర్త మృతి

image

గుర్ల మండలం కొండగండ్రేడుకు చెందిన పాపినాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. భార్య సీమంతం జరిగి రెండు రోజులు గడవకముందే ఈ విషాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం నుంచి తిరిగి వస్తూ మొక్కజొన్న కంకులు ఆరబెట్టిన రోడ్డుపై బైక్‌ అదుపుతప్పి పడిపోవడంతో బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందాడు. గతంలో తండ్రి అప్పలనాయుడు కూడా ప్రమాదంలో బ్రెయిన్‌ డెడ్‌ అయి మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News October 22, 2025

VZM: సొంతం పేరిట దోచేస్తున్నారు.. భవిష్యత్‌లో ముప్పే..!

image

జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఇసుక అక్రమ రవాణా దందా జోరుగా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంతానికి మాత్రమే ఇసుకను పట్టుకువెళ్లవచ్చునని ప్రభుత్వం మంచిగా ఆలోచిస్తే ఆ ముసుగులో అక్రమార్కులు బరి తెగుస్తున్నారు. చిన్న ఆటోలు, ఎడ్ల బళ్లతో ఇసుకను డంప్ చేస్తూ అమ్మేస్తున్నారు. నదుల్లో విచ్చలవిడి తవ్వకాలతో భవిష్యత్ లో ప్రమాదం పొంచి ఉంది. మీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయా? కామెంట్ చేయండి.