News May 12, 2024

విజయనగరం: ఎలక్షన్@2024.. మూడు జిల్లాల ముచ్చట

image

విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు విశాఖ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉండగా.. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు విజయనగరం ఎంపీ స్థానానికి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అటు అల్లూరి జిల్లాలో ఉన్న అరకు ఎంపీ అభ్యర్థికి పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గ ఓటర్లు తమ ఓటును వేస్తారు.

Similar News

News March 16, 2026

VZM: కలెక్టరేట్‌లో ప్రజల నుండి 233 వినతుల స్వీకరణ

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మొత్తం 233 వినతులు అందగా అందులో 130 రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా ఉన్నాయి. వినతులను సకాలంలో పరిష్కరించాలని, ఆలస్యం సహించబోమని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

News March 16, 2026

VZM: 22ఏ నిషేధిత జాబితా నుంచి 13 మంది రైతులకు విముక్తి

image

రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో భాగంగా 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన 13 మంది రైతులకు ఆయన ఉత్తర్వులు అందజేశారు. రెవెన్యూ, సర్వే అధికారులు రికార్డులు పరిశీలించి భూములు ప్రభుత్వానికి సంబంధించినవి కావని నిర్ధారించారు.

News March 16, 2026

VZM: పదోతరగతి పరీక్షకు 75 మంది దూరం

image

విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 23,015 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, 22,940 మంది హాజరయ్యారని DEO మాణిక్యం నాయుడు తెలిపారు. మొత్తం 75 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ పరీక్షకు 455 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, 423 మంది హాజరయ్యారన్నారు. మొత్తం 32 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు.