News September 6, 2024
విజయనగరం: ఏపీ స్కిల్ కాలేజ్ లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
డి.ఆర్.డి.ఎ-సీడ్ ఏపీ ఆధ్వర్యంలో స్కిల్ కాలేజ్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీడీ కళ్యాణ్ చక్రవర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ ఉదయం 10గం.లకు టీటీడీసి మహిళా ప్రాంగణంలో సంబంధిత సర్టిఫికెట్లుతో హాజరుకావలన్నారు. ప్రొడక్షన్ కెమిస్ట్, జూనియర్ స్టోర్ కీపర్, సెక్యూరిటీ ఆఫీసర్ కోర్సులకు సంబంధించి 4 నెలల శిక్షణ ఉంటుంది.
Similar News
News October 12, 2024
విజయనగరం: మద్యం షాపుల డ్రా స్థలం మార్పు
నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం షాపుల డ్రా స్థలం మార్పు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ నాథుడు తెలిపారు. సుజాత కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించాల్సిన డ్రా విధానం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 14న కలెక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో డ్రా తీస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థల మార్పును దరఖాస్తుదారులు గమనించాల్సిందిగా ఆయన సూచించారు.
News October 12, 2024
ఉమ్మడి జిల్లాలో 6,426 దరఖాస్తులు
ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొత్త షాప్‌ల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణలో కిక్కు ఎక్కించే ఉమ్మడి జిల్లాలో ఊహించని రీతిలో దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 205 షాప్‌లకి 6,426 దరఖాస్తులు దాఖలు రాగా రూ.128.52 కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో పార్వతీపురంలో 52 షాప్‌లకు 1,376 దరఖాస్తులకు రూ.27.52 కోట్లు ఆదాయం వచ్చింది. విజయనగరం జిల్లాలో 153 షాప్‌లకి 5,050 దరఖాస్తులు రాగా రూ.101 కోట్లు ఆదాయం వచ్చింది.
News October 12, 2024
పార్వతీపురంలో రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి
రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ బాలాజీ తెలిపిన వివరాలు ప్రకారం.. పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న జీ మల్లేశ్వరరావు (37) పట్టణ సమీపంలో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.