News August 29, 2024
విజయనగరం కమిషనర్ టాలెంట్ గురించి మీకు తెలుసా?

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న నల్లనయ్యను తెలుగు భాష అంటే మక్కువ ఎక్కువ. ఉత్తరాంధ్ర మాండలికం అంటే ప్రాణం. ఆ యాస కలకాలం బతికేలా రచనల ద్వారా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. “ఉత్తరాంధ్ర అమ్మమ్మలు, నాయనమ్మల్లార మమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నారా” అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆయన చేసిందే. ఉత్తరాంధ్ర యాస మనుగడకు తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు నల్లనయ్య తెలిపారు.
Similar News
News July 11, 2025
జిందాల్ రైతులకు చట్టప్రకారమే పరిహారం: కలెక్టర్

జిందాల్ భూములకు సంబంధించి మిగిలిన రైతులకు పరిహారాన్ని వారం రోజుల్లో అందజేయాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిందాల్‌కు కేటాయించిన భూములకు సంబంధించి విజయనగరంలోని తమ ఛాంబర్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఇప్పటివరకు చెల్లించిన పరిహారం, పెండింగ్ బకాయిలపైనా ఆరా తీశారు. 28 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి 15 మందికి పరిహారం అందజేయాల్సి ఉందని తెలిపారు.
News July 11, 2025
సీజనల్ వ్యాధులను అరికట్టాలి: కలెక్టర్

సీజనల్ వ్యాధులు విజృంభించకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా కట్టుధిట్టంగా చర్యలు తీసుకోవాలన్నారు.
News July 11, 2025
అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన

విజయనగరంలోని పోలీసు సంక్షేమ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి SP వకుల్ జిందల్ గురువారం శంకుస్థాపన చేశారు. రెండు అంతస్తుల్లో నాలుగు తరగతి గదుల నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో తక్కువ ఫీజులతో పోలీసుల పిల్లలకు, ఇతర విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవనాలు నిర్మిస్తున్నామన్నారు.