News June 25, 2024
విజయనగరం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అంబేడ్కర్
విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్ అంబేద్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లాకు బదిలీ మీద వెళ్తున్న ప్రస్తుత కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి నుంచి ఆయన చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని రంగాలపై అవగాహన పెంచుకుంటానని, ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలు చేసేందుకు, ప్రజోపయోగ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
Similar News
News October 7, 2024
పైడిమాంబ ఉత్సవాలు.. ఓం బిర్లాకు ఆహ్వానం
పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీలో సోమవారం కలిశారు. విజయనగరంలో ఈనెల 13, 14, 15వ తేదీల్లో జరగనున్న శ్రీపైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని అందజేశారు.
News October 7, 2024
విజయనగరంలో వాలంటీర్ల నిరసన
విజయనగరంలో గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు సోమవారం ఉదయం నిరసనకు దిగారు. యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వాలంటరీల వ్యవస్థను కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల గౌరవ వేతనం బకాయిలు చెల్లించాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్లను కొనసాగించాలని కోరారు.
News October 7, 2024
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ షెడ్యూల్ ఇదే
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఉదయం 8 గంటలకు బొండపల్లి మండలం ముద్దూరు గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.