News October 15, 2024
విజయనగరం కళలకు పుట్టినిళ్లు: హోం మంత్రి
విజయనగరం కళలకు పుట్టినిల్లు అని రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి వంగలపూడి అనిత కొనియాడారు. రెండురోజులపాటు ఘనంగా నిర్వహించిన విజయనగరం ఉత్సవాల ముగింపు సభలో సోమవారం రాత్రి హోమ్ మంత్రి మాట్లాడారు. విజయనగరం ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. నగరంలో ఏ మూల చూసినా కళా ప్రదర్శనలతో కోలాహలంగా ఉందని అన్నారు. ఘంటసాల, సుశీల లాంటి ఎంతోమంది ప్రఖ్యాతి పొందిన కళాకారులు ఇక్కడ నుంచే వచ్చారన్నారు.
Similar News
News November 12, 2024
విజయనగరం: మూడు జిల్లాలకు ఒక్కరే..!
వైద్య సేవ జిల్లా సమన్వయకర్త పోస్టు ఖాళీగా ఉండి నెలరోజులు గడుస్తుంది. విజయనగరం,విశాఖపట్నం,పార్వతీపురం జిల్లాలకు అప్పారావు ఒక్కరే సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. మూడు జిల్లాల బాధ్యతలు చూడడం అనేది ఏ అధికారికైనా కత్తి మీద సాము వంటిదే.వైద్య సేవ ఆసుపత్రుల పరిశీలన, సేవల తీరుపై ఆరా తీయడం, సకాలంలో వైద్యం అందేలా చూడాలి. జిల్లాకు సమన్వయకర్తను నియమిస్తే సకాలంలో వైద్యసేవలు అందుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
News November 11, 2024
విజయనగరం MLC స్థానానికి మూడు నామినేషన్లు
స్థానిక సంస్థల MLC ఉప ఎన్నిక కోసం సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్లు దాఖలు గడువు ముగిసింది. మొత్తం మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు JC ఎస్.సేతు మాధవన్ వెల్లడించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎస్.కోట మండలం బొడ్డవరకు చెందిన ఇందుకూరి సుబ్బలక్ష్మి, అదే మండలం వసి గ్రామానికి చెందిన కారుకొండ వెంకటరావు, వైసీపీ తరుఫున శంబంగి వెంకట చిన అప్పలనాయుడు నామినేషన్లు వేశారు.
News November 11, 2024
విజయనగరం జిల్లాలో పర్యటించిన ఎన్నికల పరిశీలకులు
శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ సోమవారం జిల్లాలో పర్యటించారు. ఆయనకు జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల పరిశీలకులతో సమావేశమై శాసనమండలి ఉప ఎన్నికల ఏర్పాట్లపై వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు అమలు, ఎం.సి.సి. బృందాలు ఏర్పాటు తదితర అంశాలను తెలిపారు.