News February 3, 2025
విజయనగరం: కుంభామేళా నుంచి వస్తూ టీచర్ మృతి

రోడ్డు ప్రమాదంలో టీచర్ చనిపోయిన విషాద ఘటన ఇది. విశాఖ నగరంలోని పీఎంపాలేనికి చెందిన సౌజన్య భోగాపురం(M) పోలిపల్లి స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. కుంభామేళా కోసం కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా పూసపాటిరేగ(M) కనిమెల్ల జంక్షన్ సమీపంలో ఆదివారం అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. టీచర్ అక్కడికక్కడే చనిపోగా ఆమె భర్త, కారు డ్రైవర్ గాయపడ్డారు.
Similar News
News February 19, 2025
తిరుపతి: ఇంటికి వెళ్లి వస్తానని.. అనంతలోకాలకు

చిట్టమూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. DV సత్రం(M), కల్లూరుకి చెందిన మస్తాన్(42) అత్తారిల్లు మొలకలపూడి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బైకుపై బయలుదేరాడు. చిల్లమూరు క్రాస్ రోడ్డు వద్ద మరో బైకు ఢీకొనగా..మస్తాన్ దుర్మరణం చెందాడు. ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుడి కూతురు సార్య పదో తరగతి చదువుతోంది. అతడి బంధువులు బోరున విలపించడం చూపరులను కన్నీళ్లు తెప్పించింది.
News February 19, 2025
శ్రీలత రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే!

BJP జిల్లా పార్టీ పగ్గాలు తొలిసారి మహిళ చేతిలోకి వెళ్లాయి. జిల్లా అధ్యక్షురాలిగా నేరేడుచెర్లకు చెందిన శ్రీలతరెడ్డిని అధిష్ఠానం నియమించింది. 2019లో BRSతో రాజకీయప్రస్థానం మొదలుపెట్టిన ఈమె నేరేడుచెర్ల మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2023లో MP ఈటల సమక్షంలో BJPలో చేరి HNR నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాగా ఆమె సోదరుడు పోరెడ్డి కిషోర్ BJPలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
News February 19, 2025
శ్రీశైల క్షేత్రంలో నేటి పూజ కార్యక్రమాలు ఇవే

శ్రీశైలం క్షేత్రంలో నేటి బుధవారం మంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శ్రీస్వామివారి యాగశాలలో బ్రహ్మోత్సవ క్రతువులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 10 గంటల నుంచి పుణ్యాహవాచనం, అఖండదీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, రుద్రకలశస్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, సాయంత్రం సాయంకాలార్చనలు, అగ్నిప్రతిష్ఠాపన, అంకురారోపణ, రుద్రహోమం నిర్వహిస్తారు.