News May 3, 2024
విజయనగరం గ్రామ సంస్థానికి 1937లో తొలిసారి ఎన్నికలు

జమీందారీ వ్యవస్థలు ఉన్నప్పుడు 1937 ఫిబ్రవరి 9న తొలిసారి విజయనగరం గ్రామ సంస్థానానికి ఎన్నిక నిర్వహించారు. విజయనగరం సంస్థానాదీశులు మీర్జా రాజా పూసపాటి అలకనారాయణ గజపతి మహారాజు నీలిరంగు పెట్టె గుర్తుతో బరిలో దిగారు. అప్పట్లో ఆయన్ను గెలిపించాలని కోరుతూ విజయనగరం సంస్థాన మార్‌గుజారీమాన్యమ్ ఇనాందార్లు కట్టోజు పెద్దగంగరాజు, జి.వీర్రాజునాయుడు పంచిన కరపత్రాన్ని మనం పై ఫొటోలో చూడొచ్చు.
Similar News
News December 15, 2025
VZM: ‘చిన్న పత్రికలకు చేయూత ఇవ్వాలి’

చిన్న, మధ్య తరహా పత్రికలకు మద్దతు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డికి విలేకరుల బృందం సోమవారం వినతిపత్రం ఇచ్చారు. అక్రిడిటేషన్ సంఖ్య పెంపునకు ఇతర జిల్లాల నుంచి ప్రచురితమవుతున్న విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న విలేకరులకు అక్రిడిటేషన్ మంజూరు చేయాలన్నారు. క్యాలెండర్ ప్రకటనల ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలనే అంశాలను వినతిలో ప్రస్తావించారు.
News December 14, 2025
VZM: ఎంపికైన కానిస్టేబుళ్లకు ముఖ్య గమనిక..

విజయనగరం జిల్లాలో కానిస్టేబుళ్లుగా ఎంపికైన పురుష, మహిళా అభ్యర్థులు సోమవారం ఉదయం 5 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద హాజరుకావాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ సూచించారు. అభ్యర్థితో పాటు వారి తల్లిదండ్రులు, సమీప బంధువులు ఇద్దరు కలిపి మొత్తం ముగ్గురు హాజరుకావాలన్నారు. అభ్యర్థులు, కుటుంబసభ్యులకు పోలీసు శాఖ టిఫిన్, భోజన సదుపాయం కల్పిస్తుందని చెప్పారు. పురుష అభ్యర్థులు నీట్ షేవింగ్తో రావాలని సూచించారు.
News December 14, 2025
కొత్తవలస: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొత్తవలస (M) తుమ్మకాపల్లి ఫైర్ స్టేషన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్లశంకర్రావు (52) మృతి చెందాడు. వేపాడ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గొల్ల దారప్పడు, గొల్ల శంకర్రావు ద్విచక్ర వాహనంపై పిల్లలతో విశాఖ బీచ్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో శంకర్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన దారప్పడును KGHకి తరలించారు. పిల్లలు భవాని, శంకర్ గాయపడ్డారు.


