News October 13, 2024
విజయనగరం చరిత్ర భవిష్య తరాలకు తెలియాలి : మంత్రి
మన సంస్కృతి, చరిత్ర, సాంస్కృతిక వైభవాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం ఉత్సవాల్లో భాగంగా, శ్రీ పైడితల్లి అమ్మవారి చరిత్ర, విజయనగరం గొప్పదనాన్ని వివరిస్తూ రూపొందించిన లేజర్ షోను కోట వద్ద మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విజయనగరం గొప్ప చారిత్రక సంపదకు ఘనమైన చరిత్రకు నిలయమని పేర్కొన్నారు. ఈ చరిత్రను నేటి తరానికి తెలియజేయాలన్నారు.
Similar News
News November 4, 2024
‘పార్వతీపురం మన్యం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి’
పార్వతీపురం మన్యం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రెండవ రోజు దీక్షలను కొనసాగించారు. ఈ ప్రభుత్వం విద్యా రంగ సమస్యలపై దృష్టి సారించి తక్షణమే వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేసి విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
News November 3, 2024
విజయనగరం బీసీ హాస్టల్ విద్యార్థి మృతిపై మంత్రి దిగ్బ్రాంతి
విజయనగరం బీసీ హాస్టల్ విద్యార్థి మృతిపై మంత్రి సవిత తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఏడో తరగతి చదువుతున్న కొణతాల శ్యామలరావు బ్రేక్ ఫాస్ట్ తిన్న తరువాత కళ్లు తిరుగుతున్నాయని తోటి విద్యార్థులకు తెలిపి అపస్మారకస్థితిలోకి వెళ్లి ఆకస్మికంగా మృతి చెందాడు. శ్యామలరావు మృతికి కారణాలు తెలపాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధితుని కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
News November 3, 2024
విజయనగరం: అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో విజయనగరం పరిధిలో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ముసుగులు తొడిగారు. కమిషనర్ పి.నల్లనయ్య ఆదేశాలతో ప్రణాళిక అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగినట్లు కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు.