News August 28, 2024

విజయనగరం జడ్పీలో బదిలీల సందడి

image

ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్‌లో బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. బదిలీలు కోరుతూ ఇప్పటికే పలువురు ఉద్యోగులు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ నెలాఖరికి ఈ ప్రక్రియ పూర్తికానుంది. జడ్పీలో 846 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 235 మందికి ఐదేళ్ల సర్వీసు పూర్తయింది. వీరికి బదిలీ తప్పనిసరి. నిబంధనలు ప్రకారమే బదిలీలు చేపడతామని ఇన్ ఛార్జ్ సీఈవో శ్రీధర్ రాజా తెలిపారు.

Similar News

News September 14, 2024

పైడితల్లి జాతరకు సీఎంకు ఆహ్వానం పలికిని విజయనగరం ఎంపీ

image

వచ్చే నెల 15న జరగనున్న విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారి జాతరకు రావాలంటూ సీఎం చంద్రబాబును ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆహ్వానించారు. శనివారం ఢిల్లీలో బాబును కలిసిన ఎంపీ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పైడితల్లి అమ్మవారిని సీఎం భార్య భువనేశ్వరి దర్శించుకున్న రోజునే చంద్రబాబుకు బెయిల్ లభించిందన్న విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు.

News September 14, 2024

కేదార్‌నాథ్‌లో విజయనగరం వాసులు సేఫ్

image

కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న విజయనగరం వాసులకు గండం గట్టెక్కింది. వారిని ఒక్కొక్కరిగా అక్కడి నుంచి అధికారులు హెలికాఫ్టర్లో గుప్త కాశీకి తరలిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉద్యోగి కె.శ్రీనివాసరావు శనివారం ఉదయం హెలికాప్టర్‌లో క్షేమంగా గుప్త కాశీకి చేరుకోగా, మరో గంటలో మిగిలిన వారిని తరలించనున్నట్లు సమాచారం. మూడు రోజులుగా నలుగురు జిల్లా వాసులు కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

News September 14, 2024

విజయనగరం: యువకుడి హత్య.. నిందితుడు అరెస్ట్

image

గంట్యాడ మండలం మధుపాడలో తీవ్ర కలకలం రేపిన యువకుడి హత్య కేసులో నిందితుడు పాటూరి సాయిరామ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు DSP గోవిందరావు తెలిపారు. నిందితుడి చెల్లికి మృతుడు చల్లమనాయుడు(35) మధ్య ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిందితుడు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. సీఐ రామకృష్ణ, ఎస్సై సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.