News September 24, 2024
విజయనగరం జడ్పీ ఉన్నతాధికారులకు బదిలీలు

జిల్లా పరిషత్ లో పలువురు అధికారులకు బదిలీ అయ్యింది. జడ్పీ ఇన్ఛార్జి సీఈవోగా పనిచేస్తున్న శ్రీధర్ రాజా శ్రీకాకుళం జడ్పీ సీఈవోగా వెళ్లనున్నారు. ఆ స్థానంలో డ్వామా ఏవో సత్యనారాయణ రానున్నారు. డీపీవోగా శ్రీకాకుళం డీపీవో వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. జడ్పీ డిప్యూటీ సీఈవో రాజ్ కుమార్కు విశాఖ జడ్పీ డిప్యూటీ సీఈవోగా బదిలీ అయ్యింది. ఆయన స్థానంలో శ్రీకాకుళం జడ్పీ డిప్యూటీ సీఈవో రమేష్ రామన్ రానున్నారు.
Similar News
News December 12, 2025
VZM: ’14న మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ’

మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 14న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తెందన్నారు. దీన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
News December 12, 2025
VZM: అరుదైన శస్త్ర చికిత్స

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో లక్ష్మీకాంతం(74) ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు అత్యంత క్లిష్టమైన తుంటి మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డా.అల్లు పద్మజ తెలిపారు. గతంలో ఆమె కృత్రిమ తుంటి ఎముక అమర్చబడిన ఆమె, ఇటీవల కింద పడిపోవడంతో మళ్లీ ఎముక విరిగిందన్నారు. ప్రొఫెసర్ లోక్నాథ్ ఆధ్వర్యంలో పాత తుంటిని తీసివేసి కొత్తది అమర్చారని ఫిజియోథెరపి తర్వాత ఆమె నడుస్తోందన్నారు.
News December 12, 2025
VZM: జిల్లాలో ఎరువుల కొరత లేదు.. వ్యవసాయాధికారి

రబీ పంటల అవసరాలకు జిల్లాలో యూరియా నిల్వలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారి రామారావు గురువారం తెలిపారు. ఇప్పటివరకు 8,058 మెట్రిక్ టన్నులు అందగా.. 5,110 టన్నులు రైతులకు విక్రయించారన్నారు. నెలాఖరుకి మరో 2,600 టన్నులు చేరనున్నాయని, ప్రస్తుతం 3,058 టన్నులు RSK, గోదాముల్లో ఉన్నాయన్నారు. ఎరువుల కొరత ఏదీ లేదని, ఎంఆర్పీకి మించి అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


