News April 2, 2024
విజయనగరం: జనసేనలో చేరిన వాలంటీర్

విజయనగరం నియోజకవర్గంలో 37వ డివిజన్ స్థానిక బీసీ కాలనీలో వాలంటీర్గా పని చేస్తున్న గోక చక్రధార్ జనసేనలో చేరాడు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి రాజీనామా చేసి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో కొర్నాన రామకృష్ణ సమక్షంలో మంగళవారం జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేననీ మరింత బలోతం చేసే దిశగా పని చేస్తామని తెలిపారు.
Similar News
News November 22, 2025
SERP పనితీరుపై మంత్రి కొండపల్లి సమీక్ష

SERP పనితీరుపై అమరావతి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పనితీరు, రైతుల కోసం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ.16,846 కోట్లు రుణాలు మంజూరయ్యాయని, 2026 మార్చి నాటికి రూ.32,322 కోట్లు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
News November 22, 2025
ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం సర్వే: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం సర్వే ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 3.50 లక్షల మంది రైతుల ఇళ్లకు వెళ్లి, వారి పొలం వివరాలు, పంటలు, దిగుబడులు, అవసరాలు వంటి సమాచారాన్ని కల్టివేటర్ యాప్ ద్వారా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి టీంలను వెంటనే నియమించి ఇంటింటికీ వెళ్లి జియో-ట్యాగింగ్ చేయాలని సూచించారు.