News April 2, 2024

విజయనగరం: జనసేనలో చేరిన వాలంటీర్

image

విజయనగరం నియోజకవర్గంలో 37వ డివిజన్ స్థానిక బీసీ కాలనీలో వాలంటీర్‌గా పని చేస్తున్న గోక చక్రధార్ జనసేనలో చేరాడు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి రాజీనామా చేసి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో కొర్నాన రామకృష్ణ సమక్షంలో మంగళవారం జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేననీ మరింత బలోతం చేసే దిశగా పని చేస్తామని తెలిపారు.

Similar News

News April 18, 2025

రైలు నుంచి జారిపడి ఒకరి మృతి

image

రైలు నుంచి జారిపడి విజయనగరం జిల్లా వాసి మృతిచెందాడు. తుని జీఆర్పీ ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం..అన్నవరం-హంసవరం రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి అప్పారావు(55) మృతి చెందాడు. దర్యాప్తులో భాగంగా మృతుడు ఎల్.కోట మండలం వీరభద్రపేటకి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. గుంటూరు జిల్లాలో వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు.

News April 18, 2025

VZM: వాట్సాప్ సర్వీసులను ఉపయోగించుకోవాలి

image

గ్రామ, వార్డు సచివాలయ సర్వీసులను వాట్సాప్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం అవకాశాన్ని కల్పించిందని కలెక్టర్ అంబేద్కర్ అన్నారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో వాట్సాప్ గవర్నర్ అవగాహన బ్రోచర్లను గురువారం ఆవిష్కరించారు. దీని గురించి ప్రజలందరికీ విస్తృతంగా తెలియజేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.  గ్రామ, వార్డు సచివాలయ స్పెషలాఫీసర్ రోజా రాణి, బొబ్బిలి డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిరణ్ పాల్గొన్నారు.

News April 18, 2025

VZM: ఏడు నియోజకవర్గాల్లో MSME పార్కులు

image

జిల్లాలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల‌ను ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ చెప్పారు. ఏపి స‌చివాల‌యంలోని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్ గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించగా.. కలెక్టర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎంఎస్ఎంఈ సర్వే గురించి వివరించారు.  

error: Content is protected !!