News December 16, 2024
విజయనగరం జిల్లాను వణికిస్తోన్న చలి
ఉమ్మడి విజయనగరం జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం 7.30 దాటినా పొగమంచు వీడకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు. సోమవారం ఉదయం గజపతినగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీస్తున్న చలి గాలులతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Similar News
News February 5, 2025
మంత్రి కొండపల్లితో ఈ-వెహికల్ సంస్థ ప్రతినిధులు భేటీ
విజయవాడ ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఈ-వెహికల్ సంస్థ ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
News February 5, 2025
ఈ నెల 8న కొత్తవలసకు మాజీ ఉపరాష్ట్రపతి
కొత్తవలస మండలంలోని చింతలపాలెంలో ఈ నెల 8న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. భీష్మ ఏకాదశి పర్వదినం పురష్కరించుకుని చిట్టిపాప తీర్ధ మహోత్సవం సందర్భంగా జరగనున్న సాహిత్యగోష్టికి వెంకయ్యనాయుడు హాజరవుతారని సర్పంచ్ సీతారామపాత్రుడు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారని చెప్పారు.
News February 4, 2025
విశాఖలోని విజయనగరం వాసి ఆత్మహత్య
విశాఖలోని విజయనగరం వాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మృతుడు విజయనగరం జిల్లా తెర్లాం మండలం పనుకువలస గ్రామానికి చెందిన అలుగుబెల్లి గణేశ్ (43)గా పోలీసులు గుర్తించారు. విశాఖలో పెయింటర్‌గా పనిచేస్తున్న గణేశ్ మిథిలాపురిలోని ఉడాకాలనీలో 9 నెలలుగా ఉంటున్నాడు. కాగా మంగళవారం ఉదయం హాల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతిచెందినట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు.