News April 5, 2025
విజయనగరం జిల్లాలో అనకాపల్లి వాసి మృతి

విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తి క్వారీ వద్ద శుక్రవారం ప్రమాదవశాత్తు జారి పడి నాతవరం మండలం చెర్లోపాలెంకు చెందిన చింతల సత్తిబాబు మృతి చెందాడు. గత కొంతకాలంగా క్వారీ పనుల నిమిత్తం అక్కడకు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం క్వారీలో పని చేస్తుండగా ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Similar News
News April 23, 2025
24 నుంచి సెలవులు.. ఆదేశాలు పాటించాలి: DEO

గుంటూరు జిల్లాలోని పాఠశాలలన్నింటికీ ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ వరకు సెలవులు ఉంటాయని, 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని చెప్పారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోనోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాటించాలని సూచించారు.
News April 23, 2025
3 లక్షల గృహాలకు ప్రారంభోత్సవాలు.. ఎప్పుడంటే?

AP: రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం వేగవంతం చేసింది. జూన్ 12కు ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో 3 లక్షల ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించింది. పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అర్హులైన వారికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలం మంజూరు చేసేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు.
News April 23, 2025
ఖమ్మం: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.